Nagarkurnool: కల్వకుర్తిలో వైభవంగా వినాయక నిమజ్జనోత్సవం!

Nagarkurnool: నాగర్ కర్నూల్: కల్వకుర్తిలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం; రూ. 50,116లకు లడ్డూ దక్కించుకున్న ఇల్లెందుల శ్రీనివాస్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 24 Sept 2026 9:00 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: కల్వకుర్తిలో వైభవంగా వినాయక నిమజ్జనోత్సవం!

Nagarkurnool: కల్వకుర్తి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో బుధవారం వినాయక నవరాత్రి ముగింపు కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, దసరా నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ, లడ్డూ వేలం, వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. మొదటి లడ్డూను ఇల్లెందుల శ్రీనివాస్ రూ.50,116కు, రెండో లడ్డూను శ్రీ గంధం కిరణ్ ప్రసాద్ రూ.45,000కు వేలంలో దక్కించుకున్నారు. అలాగే మొదటి కండువాను శ్రీ గందె రవి రూ.15,116కు, రెండో కండువాను శ్రీ జూలూరు సత్యం రూ.11,116కు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. అక్టోబర్ 11 నుంచి 21వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ అమ్మవారిని వివిధ అలంకరణల్లో పూజించనున్నట్లు వెల్లడించారు.

గణపతి నవరాత్రుల చివరి రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్, ప్రధాన కార్యదర్శులు నారాయణరాజు, పానుగంటి నవీన్, కోశాధికారులు గుబ్బ కిషోర్ కుమార్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బాదం రాఘవేందర్, మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్,

పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వాస శేఖర్, చిగుళ్లపల్లి శ్రీధర్, గందె రవి, గంప వెంకటేష్, శివ్వ జగదీశ్వర్, గార్లపాటి శ్రీనివాసులు, గుగ్గిళ్ళ శంకర్, గుబ్బ వెంకటేష్, ఇల్లెందుల శ్రీనివాసులు, కొండూరు కృష్ణయ్య, గుబ్బ ప్రభాకర్, జూలూరు సత్యనారాయణ, సంబు ముత్యాలు, శివ్వ రాఘవేందర్, కల్వ ఆంజనేయులు, గంప శ్రీనివాసులు, మహిళా సంఘం అధ్యక్షురాలు గోవిందు మౌనికతో పాటు ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY