Nagarkurnool: మేరామయడి మందిర నిర్మాణానికి రూ.51 వేల విరాళం అందజేత!
Nagarkurnool: జిల్లా వెల్దండ మండలం నగరగడ్డ తండాలో శ్రీ మేరామయడి మందిర నిర్మాణానికి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు రూ. 51 వేల విరాళం అందజేశారు.
Nagarkurnool: మేరామయడి మందిర నిర్మాణానికి రూ.51 వేల విరాళం అందజేత!
Nagarkurnool: వెల్దండ మండలం నగరగడ్డ తండాలో శ్రీ మేరామయడి సూతన మందిరం నిర్మాణానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు 51 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను తండా నాయకులను అడిగి తెలుసుకున్న ఆయన, తన వంతు సహాయంగా 51,000 నగదును విరాళంగా అందించినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి విరాళం అందించడం సంతోషంగా ఉందని అమ్మవారి ఆశీర్వాదం తండా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు అన్నారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించడంపై తండా నాయకులు జూపల్లి భాస్కర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నగరగడ్డ తండా నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.




