Nagarkurnool: నవంబర్ 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
Nagarkurnool: నాగర్‌కర్నూల్ సహా రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 26న ఇందిరమ్మ చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు; కోటి మంది మహిళలకు అందించడమే లక్ష్యం.
Nagarkurnool: నవంబర్ 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
నాగర్‌కర్నూల్: మహిళల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ, గౌరవప్రదమైన జీవనానికి భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను ఆత్మీయ కానుకగా అందించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేపడుతోంది.
మహిళల సంక్షేమం, సామాజిక గౌరవం, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మహిళల పట్ల గౌరవానికి, వారి సంక్షేమానికి ప్రతీకగా ప్రభుత్వం భావిస్తోంది.
మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అవసరమైన అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.




