Nagarkurnool: మృతుడి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక భరోసా!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జేపల్లికి చెందిన మాడుగుల గెల్వయ్య మృతి చెందగా, తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.4 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Sept 2026 11:48 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: మృతుడి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక భరోసా!

Nagarkurnool: చారకొండ మండలం జేపల్లి గ్రామానికి చెందిన మాడుగుల గెల్వయ్య ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతుడి కుటుంబానికి తన అనుచరుల ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం గోలి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అనంతరం గోలి శ్రీనివాస్ రెడ్డి తరఫున రూ.4 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన గోలి శ్రీనివాస్ రెడ్డికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయాన్ని అందిస్తున్న గోలి శ్రీనివాస్ రెడ్డి సేవలను గ్రామస్తులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో జేపల్లి ఉపసర్పంచ్ వంకేశ్వరం మధు, గోపాల్ నాయక్, దొడ్లపల్లి సత్యం, వంకేశ్వరం రమేష్, బీఆర్‌ఎస్‌వీ నాయకులు తరుణ్ రాథోడ్, జేపల్లి ప్రశాంత్, మాడుగుల ఓంకార్, సత్యనారాయణ, మాడుగుల అశోక్, మున్నా తదితరులతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY