Nagarkurnool: అన్ని మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: నాగం శశిధర్!
Nagarkurnool: తెలంగాణలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి, ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ యువనేత డా. నాగం శశిధర్ రెడ్డి నాగర్‌కర్నూల్‌లో డిమాండ్ చేశారు.
Nagarkurnool: అన్ని మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: నాగం శశిధర్!
నాగర్‌కర్నూల్: రాష్ట్రంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ యువనేత డా. నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేసిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వర్షాభావం, సాగునీరు, విద్యుత్ కొరత కారణంగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ కేవలం ఒక్క మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయో ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కొరత లేదని పేర్కొన్నారు.
కల్తీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తలపెట్టిన డిండి ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య, కౌన్సిలర్ అర్జునయ్య, నాయకులు భీముడు, భీమయ్య, సత్యం, అహ్మద్, కరుణాకర్, విష్ణుచారి, డిష్ రాజు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.




