Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో అంతర్రాష్ట్ర అల్ప్రాజోలం తయారీ ముఠా గుట్టురట్టు!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో అక్రమంగా అల్ప్రాజోలం తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రూ.38 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో అంతర్రాష్ట్ర అల్ప్రాజోలం తయారీ ముఠా గుట్టురట్టు!
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా అల్ప్రాజోలం తయారు చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
నవంబర్ 15న అందిన పక్కా సమాచారంతో బిజినేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 455లో వ్యవసాయ పొలంలోని రేకుల షెడ్డుపై పోలీసులు దాడి చేశారు. అక్కడ అల్ప్రాజోలం తయారు చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.6 కిలోల అల్ప్రాజోలం, తయారీ పరికరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
విచారణలో ఈ ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి ముడిసరుకులు తెప్పించి, ఆంధ్రప్రదేశ్‌లోని కూనర్‌పల్లిలో ప్రాథమిక దశల ప్రక్రియ పూర్తి చేసి, బిజినేపల్లిలో తుది దశలో అల్ప్రాజోరం తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. అనంతరం కల్లు కాంపౌండ్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌లోని కూనర్‌పల్లిలో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా, కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన వేణుగోపాల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. మొత్తం రూ.38 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2.6 కిలోల అల్ప్రాజోలం విలువ రూ.26 లక్షలు కాగా, తయారీ పరికరాలు, రసాయనాలు, పౌడర్ విలువ రూ.12 లక్షలుగా అంచనా వేశారు. ఆరు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కేసును ఛేదించిన నాగర్‌కర్నూల్ డీఎస్పీ, సీఐ అశోక్ రెడ్డి, సీసీఎస్ సీఐ శంకర్, బిజినేపల్లి ఎస్సై శంషుద్దీన్, సీసీఎస్, ఐడీ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ అభినందించారు.




