Nagarkurnool: రంగస్థల కళాకారిణి రజినీబాయికి ఘన నివాళి

Nagarkurnool: నాగర్ కర్నూల్‌లో రంగస్థల కళాకారిణి, నంది అవార్డు గ్రహీత రజినీబాయికి కళాకారులు ఘన నివాళులర్పించారు. నాలుగు దశాబ్దాల్లో 23 వేల ప్రదర్శనలు ఇచ్చారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 7 Oct 2026 10:40 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: రంగస్థల కళాకారిణి రజినీబాయికి ఘన నివాళి

నాగర్ కర్నూల్: తెలుగు రాష్ట్రాల్లో రంగస్థల కళాకారిణిగా చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ రజినీ బాయికి కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా నాటక సమాజాల సమైక్య ఆధ్వర్యంలో ఇటీవలే స్వర్గస్తురాలైన రంగస్థల కళాకారిణి, నంది అవార్డు గ్రహీత, నాట్య మయూరిగా ప్రసిద్ధి పొందిన రజనీబాయి స్వర్గస్తులైనందున వారి సంస్మరణ సభ నాగర్ కర్నూల్ పట్టణంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి సీనియర్ కళాకారులు విచ్చేసి ఆమెతో తమకు గల అనుభవాలను పంచుకున్నారు. వారు మాట్లాడుతూ... నంద్యాలలో సురభి వంశంలో జన్మించిన

రజినిబాయి నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 23 వేల ప్రదర్శనలు ఇచ్చారని, ఎందరో యువకళాకారులను ప్రోత్సహించారని కళకు తన వంతు సహకారాన్ని అందిస్తూ, చలనచిత్రాలకు ధీటుగా రంగస్థల రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రజిని బాయికి దక్కుతుందని అన్నారు. సీనియర్ కళాకారులతో కాకుండా యువ నవ కళాకారుల సరసన కూడా నటిస్తూ వారిని కళపట్ల ఆకర్షితులను చేశారని వారు తెలియజేశారు.

చంద్రమతి, చింతామణి, ద్రౌపది, సీత, రుక్మిణి, సత్యభామ వంటి స్త్రీ పాత్రలే కాకుండా రాముడు, కృష్ణుడు, అర్జునుడు వంటి పురుష పాత్రలను కూడా ధరించి ప్రేక్షకులను మెప్పించారని కళాకారులు తెలియజేశారు. వారి నటన చాతుర్యానికి గాను నంది పురస్కారంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సత్కారాల ఎన్నో అందుకున్నారని వారు తెలియజేశారు .

ఈ కార్యక్రమంలో జిల్లా నాటక సమాజం సమైక్య అధ్యక్షులు ఆర్. సత్యం, గౌరవ అధ్యక్షులు బి. నర్సింహారెడ్డి, డి.రాములు బాస వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు జీకే వెంకటేష్, కోశాధికారి రఘునందన్ తో పాటు పలు సంస్థల కళాకారులు పద్మాలయ ఆచార్య, కేశవాచారి, ముక్తావళి, శ్రీనివాసులు, ఉదయమ్మ , సంజీవ గౌడ్, వెంకటయ్య, వెంకటపతి, విజయకాంత్, మురళీధర్ రావు, సింహాచలం, సురేష్ బాబు, చెన్నకేశవులు, బాలస్వామి, తిరుపతయాచారి, సునందాచారి, యాదగిరి, రమేష్, శ్రీనివాసులు, రామేశ్వరయ్య చారి, ఇద్రిష్, రఘ లక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL