Achampet: అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. 108 కలశాలతో భారీ ర్యాలీ!
Achampet: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నల్లపు శీను గురుస్వామి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉట్ల కోనేరులో మహిళలు దీపాలు వెలిగించి 108 కలశాలతో ర్యాలీ తీశారు.
Achampet: అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. 108 కలశాలతో భారీ ర్యాలీ!
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లపు శీను గురుస్వామి ఆధ్వర్యంలో పట్టణంలో కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఉట్ల కోనేరులో మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఉట్ల కోనేరు నుండి 108 కలశాలతో, రకరకాల పూలతో, హనుమాన్ జెండాలతో ఆంజనేయ స్వాములు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. శివయ్యకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.




