Achampet: తాటిగుండాల బేస్ క్యాంప్‌కు గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డు!
Achampet: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దోమలపెంట రేంజ్ తాటిగుండాల బేస్ క్యాంప్‌కు అటవీ సంరక్షణలో విశేష సేవలకు గాను గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డు లభించింది.
Achampet: తాటిగుండాల బేస్ క్యాంప్‌కు గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డు!
అచంపేట్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దోమలపెంట రేంజ్‌కు చెందిన తాటిగుండాల బేస్ క్యాంప్‌కు గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డు లభించింది. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, అక్రమ వేట నియంత్రణ వంటి కార్యక్రమాల్లో బేస్ క్యాంప్ సిబ్బంది అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈరోజు రాత్రి 8 .40గంటలకు హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోట వద్ద నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తాటిగుండాల బేస్ క్యాంప్ తరఫున ఐదుగురు బేస్ క్యాంప్ వాచర్లు మండ్లి బయ్యన్న, వడ్త్యావత్ హన్మంతు, జెల్ల మల్లయ్య, చిగుర్ల జోగయ్య, నిమ్మల వీరయ్య అవార్డును అందుకున్నారు. వీరితో పాటు తాటిగుండాల సెక్షన్ ఆఫీసర్ శ్రీ చి. రామాంజనేయులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని క్లిష్టమైన అటవీ ప్రాంతంలో పనిచేస్తూ, ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ బేస్ క్యాంప్ సిబ్బంది నిరంతరం అటవీ రక్షణ విధులు నిర్వహిస్తున్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలను గుర్తించడం, వాటిని నియంత్రించడం, వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ కార్యకలాపాల నివారణ, అటవీ వనరుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరియు బేస్ క్యాంప్ వాచర్ల సమన్వయంతో కొనసాగుతున్న ఈ సేవలకు లభించిన అవార్డు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ గుర్తింపు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ సంరక్షణ కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.




