Veldanda: వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ మట్ట యాదమ్మ
Veldanda: వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Veldanda: వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ మట్ట యాదమ్మ
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన కొమ్మగోని బాలరాజు గౌడ్ కుమారుడు గణేష్ వివాహ వేడుకలు ఆదివారం కేఎల్ఆర్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మట్ట విష్ణు, ఎండీ రషీద్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, కొండల్, వెంకటేష్, రేవల్లి రాజు, ఈదులపల్లి శ్రీనివాస్, నాగరాజు, తిరుపతి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.




