Kalwakurthy: పలు శుభకార్యాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు జూపల్లి
Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన పలు వివాహ, పుట్టు పంచెల వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జూపల్లి భాస్కర్ రావు పాల్గొన్నారు.
Kalwakurthy: పలు శుభకార్యాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు జూపల్లి
కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన పలు శుభకార్యాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జూపల్లి భాస్కర్ రావు పాల్గొని సందడి చేశారు. పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో జరిగిన బొడ్డు సాల్వా చారి కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అదేవిధంగా అక్కి అల్లాజీ కుమార్తె, కుమారుడి పుట్టు పంచెల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో జూపల్లి గ్రామ సర్పంచ్ అనూష జగపతి, సీఐ భాస్కర్, కరెంటు మల్లయ్య, సిద్దయ్య, పుల్లయ్య, భాస్కరరావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




