Devarakadra: వర్షాలు కురవాలంటూ దేవరకద్ర పెద్ద చెరువులో ప్రత్యేక ప్రార్థనలు!
Devarakadra: దేవరకద్ర పెద్ద చెరువులో వర్షాలు కురవాలని ముస్లిం మైనార్టీ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. ఎల్ నినో ప్రభావంతో ఎండిన పంటలు, చెరువులు.. వరుణ దేవుడి కరుణ కోసం వేడుకోలు.
Devarakadra: వర్షాలు కురవాలంటూ దేవరకద్ర పెద్ద చెరువులో ప్రత్యేక ప్రార్థనలు!
దేవరకద్ర: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక ఇప్పటివరకు దేవరకద్ర మండలంలో ఎక్కడ కూడా చెరువులు, కుంటలు నిండలేదు. ఎక్కడ చూసినా బోసిపోయిన చెరువులు, కుంటలే దర్శనమిస్తున్నాయి.వర్షాలు కురవాలంటూ మైనార్టీ సోదరులు పెద్ద చెరువులో శుక్రవారం రోజు సామూహికంగా ప్రార్థనలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం సందర్భంగా మైనార్టీ సోదరులు వర్షాలు కురవాలంటూ పెద్ద చెరువులో ప్రార్థనలు చేశారు.
వర్షాలు లేక వేసిన పంటలు ఎక్కడికి అక్కడే ఎండిపోయే పరిస్థితి ఉందని రాబోయే కాలంలో తాగునీటికి కూడా గడ్డుకాలం ఏర్పడే అవకాశం ఉందని, పశుపక్షాధులకు సైతం నీళ్లు దొరకని పరిస్థితి దాపురించిందని ముస్లిం సోదరులు అందరూ సామూహికంగా ప్రార్థనలు చేసి వర్షాలు కురవాలంటూ ఆ వరుణ దేవుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర పట్టణ అధ్యక్షుడు ఫారుక్, ఖదీర్, గౌస్, మాజీద్ , లియాఖత్ , రషీద్, నూర్, సైఫ్, ఖాళీద్ , జాహెద్ , అమీర్ , పాష, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.




