Maddimadugu: మద్దిమడుగు ఆలయాన్ని పరిశీలించిన ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు!

Maddimadugu: ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేట పర్యటన నేపథ్యంలో శుక్రవారం మద్దిమడుగు ఆలయం, వై జంక్షన్ సభా స్థలిని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు పరిశీలించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 20 Nov 2026 6:47 PM IST
Maddimadugu
X

Maddimadugu: మద్దిమడుగు ఆలయాన్ని పరిశీలించిన ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు!

Maddimadugu: మద్దిమడుగు ఆలయాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఈనెల 26వ తేదీన అచ్చంపేట నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి 26న పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం మద్దిమడుగు ఆలయం, సేవాలాల్ విగ్రహ స్థలి పరిశీలన.

సీఎం పర్యటనకు ముందస్తుగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు మద్దిమడుగుకు చేరుకుని శ్రీ పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సేవాలాల్ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని, ఆలయ పరిసరాలను, సీఎం వచ్చే మార్గం, వేదిక ప్రాంతం, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆలయానికి విచ్చేసిన వీరికి అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను తెలియజేశారు.

వై జంక్షన్ సభా స్థలి పరిశీలన..

అంతకుముందు అచ్చంపేట వై జంక్షన్ వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదిక, సభా స్థలిని టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు & అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పరిశీలించారు. వేదిక నిర్మాణం, ప్రజలు కూర్చునే ప్రాంతం, పార్కింగ్, ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్, సౌండ్ సిస్టం, భద్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో చర్చించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ పరిశీలన కార్యక్రమాల్లో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా,మద్దిమడుగు దేవస్థానం చైర్మన్ రాములు నాయక్, ఆలయ కార్య నిర్వహణ అధికారి రంగస్వామి,అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA