Achampet: యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Achampet: ఉప్పునుంతల మండలం రాయిచేడులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పరిశీలించారు.
Achampet: యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన: ఎమ్మెల్యే వంశీకృష్ణ
నాగర్ కర్నూల్ జిల్లా: అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతలా మండలం రాయిచేడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ స్థలంలో జరుగుతున్న పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నుంచి పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయికి దీటుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత గురుకుల విద్యను అందించడమే లక్ష్యంగా ఈ యంగ్ ఇండియా స్కూల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
అచ్చంపేట వంటి మారుమూల ప్రాంతంలో ఇంతటి భారీ విద్యా ప్రాజెక్టు రావడం ఎంతో సంతోషకరమని, ఈ పాఠశాల పూర్తయితే ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఆయన పేర్కొన్నారు.
నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, నిర్దేశించిన గడువు లోపే భవనాలను పూర్తి చేయాలని, కార్మికులకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత శాఖల ఇంజనీర్లు, కాంట్రాక్టర్ ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




