Peddamandadi: మంగంపల్లిలో తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి!

Peddamandadi: పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం తన సొంత వ్యవసాయ క్షేత్రంలోని ఆయిల్ పామ్ తోటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 23 Nov 2026 2:58 PM IST
Peddamandadi
X

Peddamandadi: మంగంపల్లిలో తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి!

Wanaparthy: శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం పెద్దమందడి మండలం మంగంపల్లిలో తన సొంత వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడ సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను పరిశీలించారు.

తోటలో మొక్కల పెరుగుదల, నిర్వహణ తీరును పరిశీలించిన ఎమ్మెల్యే గారు, మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని వ్యవసాయ క్షేత్ర సిబ్బందికి సూచించారు.

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా ఆయిల్ పామ్ ను సాగు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న నేపథ్యంలో రైతులు ఈ పంట సాగుపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.

ఆయిల్ పామ్ సాగు ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని, సరైన యాజమాన్య పద్ధతులు, నీటి నిర్వహణ, మొక్కల సంరక్షణ పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై కూడా దృష్టి సారించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY