Nagarkurnool: వెల్దండలో గణపతి పూజలు.. పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి

Nagarkurnool: వెల్దండ శ్రీ పాండురంగ నాయక దేవాలయంలో ప్రతిష్ఠించిన గణనాథునికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేసి, అన్నదానంలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 7:08 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: వెల్దండలో గణపతి పూజలు.. పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రంలోని శ్రీ పాండురంగ నాయక దేవాలయంలో ప్రతిష్ఠించిన గణనాధునికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు యన్నం శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావం పెంపొందిస్తాయని ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని అన్నారు.

కార్యక్రమంలో ఏసీబీ నెంబర్ ఠాగూర్ బాలాజీ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ యన్నం భూపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా సంజీవ్ యాదవ్ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ రైతు కన్వీనర్ సుదర్శన్ రెడ్డి డాక్టర్ హరికాంత్ రెడ్డి వై కృష్ణారెడ్డి ఆంజనేయులు ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్ భరత్ గౌడ్ , పురుషోత్తం చారి పుల్లయ్య తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY