Veldanda: ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఎమ్మెల్యే కసిరెడ్డి సత్కారం

Veldanda: వెల్దండకు చెందిన గుద్దేటి సరిత నీట్‌లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటు పొందడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఘనంగా సత్కరించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 7:49 PM IST
Veldanda
X

Veldanda: ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఎమ్మెల్యే కసిరెడ్డి సత్కారం

నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రంలో చెందిన ఇటీవల నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటును సాధించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత వెల్దండ మండల కేంద్రంలో ఘనంగా శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థిని ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నీట్ లో ఉత్తీర్ణత సాధించడం నిజంగా హర్షించదగ్గ విషయమని ముందుగా వారి తల్లిదండ్రులకు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి, వైద్యరంగంలో శిఖరాగ్రాలను అధిరోహించి పేదలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థిని మాట్లాడుతూ శ్రద్ధగా చదివి వైద్యురాలిగా రాణిస్తానని, ప్రజలకు తమ వంతుగా ప్రజలకు సేవలు అందిస్తానని అన్నారు.

అనంతరం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ 10,000 వేల రూపాయలు ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదగా విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్నం భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హరికిషన్ నాయక్ సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను వార్డు నెంబర్ సభ్యులు పురుషోత్తం చారి గుద్దేటి కిష్టాల్ ముదిగొండ రమేష్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య దర్గయ్య తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY