Devarakadra: కౌకుంట్లలో విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 3 Nov 2026 12:57 PM IST
Devarakadra
X

Devarakadra: కౌకుంట్లలో విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Devarakadra: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించేందుకు, విద్యా ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అల్పాహార పథకాన్ని కౌకుంట్ల మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అల్పాహారం పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కొంతమంది ఉదయం అల్పాహారం తీసుకోకుండా పాఠశాలకు రావడం వల్ల ఆకలి, నీరసం కారణంగా చదువుపై ప్రభావం పడే అవకాశం ఉందని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే గారు తెలిపారు.

ప్రీ-ప్రైమరీ (PP) నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ అల్పాహార పథకం వర్తిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం సంవత్సరానికి 540 కోట్ల రూపాయలు, పాల సరఫరా కోసం మరో 180 కోట్లు మొత్తంగా ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా 720 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి, తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు, మండల అధ్యక్షుడు రాఘవేంద్ర రెడ్డి, సర్పంచ్ నరేష్, మాజీ దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి,ముచ్చింతల సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,ఎంపీడీవో శివప్రసాద్, ఎమ్మార్వో, విద్యార్థులు, అధ్యాపకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA