Devarakadra: దేవరకద్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. ఎమ్మెల్యే!

Devarakadra: బల్సుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు, విద్యార్థులకు యూనిఫాంలను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 3 Nov 2026 1:49 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. ఎమ్మెల్యే!

Devarakadra: దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని బల్సుపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ గత బిఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6500 కోట్ల రూపాయల మిత్తి కట్టుకుంటూ​ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు.

అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 2 లక్షల పంట రుణమాఫీ, 500లకే గ్యాస్​ సిలిండర్​, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్ల తో పాటు రేషన్ కార్డులు ఇచ్చామన్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేవరకద్ర ను మున్సిపాలిటీగా చేశామని, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశామని, కోర్టును ఏర్పాటు చేశామని, 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఉగాది పండుగ రోజు హాస్పిటల్ ను ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు.

పారిశ్రామికంగా వెనుకబడ్డ దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ను దేవరకద్ర కు తీసుకువచ్చామని, దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయిందని తెలియజేశారు.

త్వరలో దేవరకద్ర కు సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఫైర్ స్టేషన్, పోలీస్ సర్కిల్ ఆఫీసు ను తీసుకురాబోతున్నామని ప్రకటించిన ఎమ్మెల్యే జియంఆర్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండ దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, కౌన్సిలర్ అరుణచంద్రమౌళి, శంకర్, ఉమిగారి వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు, ఎమ్మార్వో హర్షద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA