Devarakadra: బాధిత రైతుకు రూ.40 వేల చెక్ అందించిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
Devarakadra: దేవరకద్ర మండలం నాగారంలో కరెంట్ షాక్తో గేదె మృతి చెందిన రైతు గడ్డమన్నకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రూ.40 వేల ప్రభుత్వ పరిహార చెక్కును అందజేశారు.
Devarakadra: బాధిత రైతుకు రూ.40 వేల చెక్ అందించిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర: దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన యాగరి గడ్డమన్న గేదె విద్యుత్ షాక్తో మృతి చెందింది. ఈ విషయాన్ని గతంలో స్థానికులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి, బాధిత యాగరి గడ్డమన్న కు ప్రభుత్వం తరఫున 40,000 రూపాయలు నష్టపరిహారం అందించారు.
దీనికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్ రెడ్డి, రాజు గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




