Devarkadra: దేవరకద్రలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు!
Devarkadra: దేవరకద్ర జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ పైపులైన్ పగిలి వారం రోజులుగా నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.
Devarkadra: దేవరకద్రలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు!
Devarkadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన జాతీయ రహదారి 167 పక్కనే మిషన్ భగీరథ పైపుల నుండి నీళ్లు గత వారం రోజుల నుంచి నీరు వృధాగా పోతున్నాయని ఇంచు ఇంచున్నర నీళ్లు 24 గంటల పాటు రోడ్డు వెంబడి పోతున్నా కూడా అధికారుల్లో చలనం లేదని, అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోయారు.
ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తాగడానికి కూడా నీళ్లు ఉండవని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కూడా అధికారుల్లో మార్పు రావటం లేదు. ఇప్పటికైనా స్పందించి నీళ్లు వృధా కాకుండా వెంటనే మరమ్మతులు చేయాలని నీటి వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.




