Makthal: మక్తల్లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన వాకిటి లలిత!
Makthal: మక్తల్ పట్టణం 16వ వార్డులో గురువారం రాష్ట్ర మంత్రి శ్రీహరి సతీమణి వాకిటి లలిత 6 నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి వాకిటి వారి కానుక అందజేశారు.
Makthal: మక్తల్లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన వాకిటి లలిత!
మక్తల్: మక్తల్ పట్టణంలోని 16వ వార్డు లో 6 నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి అనంతరం వారికి వాకిటి వారి కానుకను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాగిరి శ్రీహరి గారి శ్రీమతి వాకిటి లలిత.
అనంతరం మంత్రి సతీమణి వాకిటి లలిత మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఇందిరమ్మ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, స్థానిక వార్డు సభ్యురాలు పావని, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రవికుమార్,కోఆప్షన్ సభ్యులు వల్లంపల్లి లక్ష్మణ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలం, ఓబ్లేష్,నాగరాజ్ వేణు గౌడ్ కల్లూరు గోవర్ధన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.




