Makthal: ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి సతీమణి వాకిటి లలిత!
Makthal: మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మండలం వడ్వాట్, మండిపల్లి గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇండ్లను శుక్రవారం మంత్రి సతీమణి వాకిటి లలిత ప్రారంభించారు.
Makthal: ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి సతీమణి వాకిటి లలిత!
మక్తల్: మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మండలం వడ్వాట్, మండిపల్లి గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇండ్ల ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి సతీమణి శ్రీమతి వాకిటి లలిత గారు.
అనంతరం వాకిటి లలిత గారు మాట్లాడుతూ పేదోడి సొంత ఇంటి కలలను నిజం చెసిన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వాకిటి వారి కానుకను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన లలిత గారు.
ఇట్టి కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమూర్తి,నాగరాజు, కల్లూరి గోవర్ధన్, పాండు మరియు స్థానిక గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




