Amarachinta: అనారోగ్య బాధితుడికి రూ. 5 లక్షల ఎల్వోసీ అందజేసిన మంత్రి!
Amarachinta: అమరచింత మండలానికి చెందిన అనారోగ్య బాధితుడు చెన్నప్పకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 5 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు.
Amarachinta: అనారోగ్య బాధితుడికి రూ. 5 లక్షల ఎల్వోసీ అందజేసిన మంత్రి!
Amarachinta: అమరచింత మండలం కొంకనివానిపల్లి గ్రామానికి చెందిన బంగారాయాల చెన్నప్ప అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి వారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 5 లక్షల LOC మంజూరు చేసి TG టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ సూచనల మేరకు ప్రతిపాదనలను అందజేశారు.
ఆపదలో ఉన్న పేద కుటుంబానికి అండగా నిలిచి, వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి శ్రీహరి అన్నగారికి బంగారాయాల చెన్నప్ప కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




