Makthal: మక్తల్‌లో రూ.15 లక్షల విలువైన ఎల్‌ఓసీలను అందజేసిన మంత్రి!
Makthal: మక్తల్ నియోజకవర్గంలో వైద్య చికిత్స కోసం ఇబ్బంది పడుతున్న ముగ్గురు బాధితులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షల ఎల్‌ఓసీలను మంత్రి అందజేశారు.
Makthal: మక్తల్‌లో రూ.15 లక్షల విలువైన ఎల్‌ఓసీలను అందజేసిన మంత్రి!
Makthal: వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికి మంత్రి వాకిటి శ్రీహరి ఎల్‌ఓసీ లను అందజేశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందేలా ఎల్‌ఓసీలను మంజూరు చేయించారు.
నర్వ మండలం లంకల గ్రామానికి చెందిన అంజయ్యకు రూ.5 లక్షలు, పొగబండి అంజమ్మకు రూ.5 లక్షలు, మక్తల్‌కు చెందిన వెంకటేష్‌కు రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీలను మంత్రి అందజేశారు. బాధితులకు అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు ఈ సహాయం దోహదపడనుంది.
ఆర్థిక స్థోమత లేక వైద్య చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైద్య సహాయాన్ని అందిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని మంత్రి తెలిపారు.




