Makthal: మంథన్ గోడ్ గ్రామంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు

Makthal: తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జన్మదినం సందర్భంగా మంథన్ గోడ్ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్ వేడుకలు నిర్వహించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 1 Nov 2026 2:58 PM IST
Makthal
X

Makthal: మంథన్ గోడ్ గ్రామంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు

Makthal: తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు డా"వాకిటి శ్రీహరి అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంథన్ గోడ్ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, మంథన్ గోడ్ గ్రామ సర్పంచ్, నారాయణపేట జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లాల్ రాజేందర్ గౌడ్ గారు, గోలపల్లి సర్పంచ్ సుర్యప్రకాష్ గారు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL