Makthal: విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తాం మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్‌లో 7వ వార్డు సీసీ రోడ్డు ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి మక్తల్-వానాయికుంట రహదారి నిర్మాణానికి హామీ.

B. NARENDER, MAKTHAL
Published on: 7 Nov 2026 11:03 AM IST
Makthal
X

Makthal: విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తాం మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి!

Makthal: విద్యార్థుల భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటామని, మక్తల్‌ నుంచి వానాయికుంట వరకు రహదారి నిర్మాణం చేపట్టి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. స్థానిక 7 వ వ్వార్డులో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, అదే సమయంలో ఆటోలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను గమనించి వారితో కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు. వారి చదువులు, పాఠశాలకు వెళ్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, మీ ఊరికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించే బాధ్యత నాదని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. మక్తల్‌ నుంచి వానాయికుంట వరకు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.

విద్యార్థుల పట్ల మంత్రి చూపిన ఆప్యాయత, గ్రామ అభివృద్ధిపై ఇచ్చిన హామీ విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించింది.ఇట్టి కార్యక్రమం లో మక్తల్ మున్సిపల్ చైర్మన్ మానస, వైస్ చైర్మన్, 7వ వార్డ్ కౌన్సిలర్ విద్య నిరంజన్ గౌడ్, మక్తల్ మున్సిపాల్ కౌన్సిలర్లు, వార్డు ప్రజలు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL