Makthal: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరికి పాలాభిషేకం!
Makthal: మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో పెన్షన్ల మంజూరు, జీవిత బీమా పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
Makthal: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరికి పాలాభిషేకం!
మక్తల్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో వార్డు కౌన్సిలర్ అలుకూరి పావని ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీమతి సీతక్క &మంత్రి వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా అలుకురి పావని మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వాకిటి శ్రీహరి గారి సహకారంతో మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారితో పాటు సీఎం రేవంత్ రెడ్డికి &మంత్రి శ్రీమతి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
దీంతోపాటు ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా అందించారని గతంలో కొందరికి మాత్రమే పరిమితమైన జీవిత బీమా నేడు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందబోతుందని తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్ మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్ ఆప్షన్ మెంబర్లు వల్లంపల్లి లక్ష్మణ్ బుక్ సెంశుద్దీన్ మార్కెట్ డైరెక్టర్ శాలం, మిస్కిన్ నాగరాజ్, హుసముద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాలం, రమేష్, వాళి, మహమ్మద్,రాజశేఖర్, కిరాలింగ, గఫార్,గోపాల్,అరవింద్, అంకిత్, గంగాధర్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




