Nagarkurnool: మెడికల్ కాలేజీ కార్మికుల ధర్నా.. పెండింగ్ వేతనాలు చెల్లించాలి!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 18 Nov 2026 9:51 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: మెడికల్ కాలేజీ కార్మికుల ధర్నా.. పెండింగ్ వేతనాలు చెల్లించాలి!

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రతి నెల 5వ తేదీ వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్యం నశించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ గేటు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు నెల అంతా కష్టపడి పని చేస్తే కాలేజీ యాజమాన్యం బిల్లులు ఇవ్వలేదని సాకుతో కార్మికులకు వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. అతి తక్కువ వేతనంతో పని చేసే కార్మికులకు ప్రతినెల వేతనాలు రాకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురవుతారని ఆయన అన్నారు.

ప్రతినెల సమ్మె చేస్తే కానీ వేతనాలు వచ్చే పరిస్థితి లేదని ఈ పద్ధతి వెంటనే మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో అనేక సందర్భాలలో కార్మికులకు వేతనాలు చెల్లించడంలో బిల్లులు సాకుగా చెప్పి వేతనాలు చెల్లింపులో తీవ్రమైన జాప్యం చేశారని ఆపద్ధతి వచ్చే నెల కొనసాగకూడదని వచ్చేనెల ఐదో తేదీ వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు నాగమ్మ ప్రధాన కార్యదర్శి మైముదా బేగం కోశాధికారి అరుణ సాయమ్మ పావని రాణి అస్మా అంజనమ్మ రేణుక శ్వేత అన్నపూర్ణ చెన్నమ్మ పరశురాములు మోహన్ నితిన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL