Nagarkurnool: కల్లుగీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా: మదన్ గౌడ్!

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా కల్లుగీత సహకార సంఘాల సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌గా వెల్దండకు చెందిన మట్ట మదన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Oct 2026 8:09 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: కల్లుగీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా: మదన్ గౌడ్!

నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో విద్యానగర్‌లోని యూటీఎఫ్ భవన్‌లో గురువారం జరిగిన జిల్లా కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో వెల్దండ మండల కేంద్రానికి చెందిన మట్ట మదన్ గౌడ్‌ను జిల్లా సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మట్ట మదన్ గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత సహకార సంఘాల సమన్వయం, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయనున్నట్లు మదన్ గౌడ్ తెలిపారు మట్ట మదన్ గౌడ్ కు పలువురు అభినందనలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY