Makthal: కర్ణాటకకు తరలిపోతున్న తెలంగాణ సన్న రకం వరి ధాన్యం

Makthal: మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల్లో పండే సన్న రకం వరి ధాన్యం కర్ణాటక రాయచూర్‌కు తరలిపోతోంది. క్వింటాల్‌కు రూ. 4000 ధర పలుకుతుండటంతో రైతులు హర్షం.

B. NARENDER, MAKTHAL
Published on: 30 Oct 2026 9:18 PM IST
Makthal
X

Makthal: కర్ణాటకకు తరలిపోతున్న తెలంగాణ సన్న రకం వరి ధాన్యం

మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణ మండల్ మాగనూరు మండల్ మక్తల్ మండల్ లా వరి ధాన్యం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు వెళ్ళిపోతుంది. తెలంగాణలో పండిన సన్న రకాలకు కర్ణాటక రాష్ట్రంలోభారీ ధర పలుకుతుంది. నెల క్రితం సన్న రకాల వరి ధాన్యం కు క్వింటాల్ 2800 రూపాయలు పలికేది.

కోతల సమయానికి సన్న రకాల వడ్లకు 1200 రూపాయలు పెరిగి నాలుగు వేల రూపాయల క్వింటాలకు చేరింది.ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వరి దిగుబడులు చాలా తగ్గిపోయాయి. గత సంవత్సరం రైతులు పండించిన వరి ధాన్యాన్ని రైతులే తమ సొంత వాహనాలలో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు తరలించి అమ్ముకునేవారు.

ప్రస్తుతం వరి కోతల దగ్గరికి కర్ణాటక రైస్ మిల్లు యాజమాన్యం వారు వచ్చి అక్కడికక్కడే డబ్బులు చెల్లించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కృష్ణానది పరిహా ప్రాంతం అయినటువంటి కృష్ణా మండలం, మాగనూరు మండలం, మక్తల్ మండలంలో,సుమారు 5,000 వేల ఎకరాలలో రైతులు సన్న రకాల వరి పంటలను పండిస్తున్నారు.

ఇక్కడ పండుతున్న వరి ధాన్యాన్ని కర్ణాటక రైస్ మిల్లర్లు వచ్చి రైతులకు ముందస్తుగా డబ్బులు చెల్లించి వరి ధాన్యమును తమకే అమ్మే విధంగా ఒప్పందం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన రైతులు మాత్రం ప్రభుత్వమునకు అమ్మడానికి ఇష్టపడడం లేదు.

తెలంగాణ ప్రభుత్వం సన్న రకాల ధాన్యమునకు బోనస్ 500 రూపాయలు చెల్లిస్తున్న మొత్తం క్వింటాలుకు 2800 రూపాయలు మాత్రమే వస్తున్నందున, కర్ణాటకలో క్వింటాల్ వరి ధాన్యమునకు 4000 రూపాయలు వస్తున్నందున రైతులు తమ వరి ధాన్యమును కర్ణాటకకు తరలిస్తున్నారు. వరి ధాన్యం రికార్డు స్థాయిలో కర్ణాటకలో మద్దతు ధర పలుకుతున్నందున రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL