Makthal: బాల్య వివాహాలు చేయొద్దు.. బాల్యాన్ని కాపాడాలి
Makthal: మక్తల్ మండలం గుడిగండ్ల ప్రభుత్వ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన; చైల్డ్ లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని మెజిస్ట్రేట్ అవినాష్ సూచన.
Makthal: బాల్య వివాహాలు చేయొద్దు.. బాల్యాన్ని కాపాడాలి
మక్తల్: మక్తల్ మండలం గుడిగండ్ల ప్రభుత్వ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మక్తల్ మెజిస్ట్రేట్ అవినాష్ గారు మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు వద్దు, బాల్య వివాహాలు చెయ్యొద్దని, బాల్య వివాహాలతో కుటుంబాలు, సమాజంలో అనేక అనర్థాలు ఎదురవుతాయని తెలిపారు. చిన్నారుల. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాల్య వివాహాలను అరికట్టాలని పిలుపునిచ్చారు.
బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసినా, ఎక్కడైనా చిన్నారులకు ఇబ్బంది కలిగినా వెంటనే చైల్డ్ లైన్ 1098 కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.
ఇట్టి కార్యక్రమంలో శ్రీనివాసులు గౌడ్ సర్పంచ్, మక్తల్ ఎస్.ఐ రాజు, ఉప సర్పంచ్ బాలకృష్ణ కె రమేష్ కె రాజు కే కాజా పాఠశాల హెచ్.ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




