Makthal: మక్తల్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

Makthal: మక్తల్ జగ్జీవన్ రామ్ కాలనీలో సత్తెమ్మ-విష్ణు నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి.

B. NARENDER, MAKTHAL
Published on: 8 Nov 2026 9:07 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్: మక్తల్ పట్టణంలోని ఎనిమిదో వార్డు బాబు జగ్జీవన్ రావు కాలనీలో సత్తెమ్మ–విష్ణు దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర క్రీడా , పాడి పరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి వారి ఇంట్లో వారితో పాటు నేలపై కూర్చొని కుటుంబ స్కభ్యులతో, వార్డు ప్రజలతో కాసేపు పిచ్చాపాటీగా మాట్లాడుతూ వారితో మమేకమాయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కాలనీలో విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి తదితర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గుర్తు చేశారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఇందిరమ్మ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL