Makthal: మక్తల్ లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి!
Makthal: మక్తల్ పట్టణంలో రూ.2.5 కోట్లతో చేపడుతున్న రహదారి, వంతెన పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి. నాణ్యతతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.
Makthal:మక్తల్ లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి!
Makthal: మక్తల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి.
మక్తల్ పట్టణంలోని 3వ వార్డులో కేశవ నగర్ నుంచి దండు వరకు 2.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న రహదారి, వంతెన నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
మక్తల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల రోజువారీ ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను ఒక్కొక్కటిగా గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
మక్తల్ రూపురేఖలు మార్చేలా సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకొస్తామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




