Makthal: మక్తల్ మండలం దాదనపల్లిలో జోరుగా ఉపాధి హామీ పనులు!
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాదనపల్లిలో జోరుగా ఉపాధి హామీ పనులు. మూగజీవాల కోసం నీటికుంటల నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవో రమేష్ వెల్లడి.
Makthal: మక్తల్ మండలం దాదనపల్లిలో జోరుగా ఉపాధి హామీ పనులు!
Makthal: మక్తల్ మండలంలో ఊపందుకున్న ఉపాధి హామీ పనులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాదనపల్లి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయని ఏపీవో సత్యమూర్తి ఎంపీడీవో డి రమేష్ తెలిపారు నేటి ఉదయం దాదంపల్లి గ్రామపంచాయతీ లో ఉపాధి హామీ పనులు సుమారు 8, 80,000 విలువగల ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి దాదనపల్లి గ్రామపంచాయతీలో సుమారు 150 మంది జాబ్ కార్డు కలిగి ఉన్నారని అందులో ఇవాళ 100 మంది దాకా ఉపాధి హామీ పనులలో పాల్గొంటున్నట్లు సర్పంచ్ శివారెడ్డి తెలిపారు.
ఒకవైపు ఎల్ నీనో ప్రభావం ఉండడంతో మూగజీవాలకు నీటి కొరత ఏర్పడిందని అందులో భాగంగా మూగజీవాల కోసం నీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నట్లు మక్తల్ ఎంపీడీవో రమేష్ తెలిపారు. 25 ఫీట్ల పొడవు 16 మీటర్ల వెడల్పు రెండు మీటర్ల లోపల నీటి కుంటలు నాలుగు కుంటలను ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేపిస్తున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శైలజ తెలిపారు.
మక్తల్ మండలంలోని ప్రజలు ఉపాధి హామీ పథకంలో తమ యొక్క పేర్లను నమోదు చేసుకొని లబ్ధి పొందగలరని ఎంపీడీవో రమేష్ తెలిపారు. జాతీయ ఉపాధి పథకంలో ప్రతి ఒక్కరికి రోజుకు 300 రూపాయల నుండి 400 రూపాయల వరకు ఉపాధి పొందవచ్చునని ఏపీఓ సత్యమూర్తి ఎంపీడీవో డి రమేష్ తెలిపారు.




