Makthal: ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: మక్తల్ సీఐ రామ్ లాల్!

Makthal: మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండల పోలీస్ స్టేషన్ వద్ద మక్తల్ సీఐ రామ్ లాల్, కృష్ణ ఎస్సై ఎస్.ఎం. నవీద్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 27 Nov 2026 7:48 AM IST
Makthal
X

Makthal: ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: మక్తల్ సీఐ రామ్ లాల్!

మక్తల్: మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం పోలీస్ స్టేషన్ వద్ద మక్తల్ సీఐ రామ్ లాల్, కృష్ణ ఎస్సై ఎస్.ఎం. నవీద్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, ప్రయాణికుల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మక్తల్ సీఐ రామ్ లాల్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు తమ వాహనాలను పరిమితికి మించి ప్రయాణికులతో నింపకూడదని, ఆటో నడిపేటప్పుడు సెల్ ఫోన్ వినియోగించకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

అలాగే వాహనాలు నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటిస్తూ, రహదారిపై ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు.

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, నిబంధనలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా కృష్ణ పోలీసులు, ఆటో డ్రైవర్ లు తది తరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL