Makthal: బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జావీద్
Makthal: నారాయణపేట జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా మక్తల్‌కు చెందిన జావీద్ హుస్సేన్ ఎంపిక. డీకే అరుణ ఆశీస్సులతో నియామక పత్రం అందజేత.
Makthal: బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జావీద్
మక్తల్: పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ గారి ఆశీస్సులతో,బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన, జావీద్ హుస్సేన్ గారికి గాన సన్మానం,బిజెపి మైనారిటీ మోర్చా నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా మక్తల్ పట్టణానికి చెందిన జావీద్ ఎంపికయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర నాయకులు జిల్లా కేంద్రంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల దేశ ప్రజలంతా ఎంతో సానుకూలంగా ఉన్నారని అన్నారు. జిల్లాలో బిజెపి బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు .
మైనార్టీలను బిజెపి వైపు మరల్చేందుకు పాటుపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తనవంతు కృషి చేస్తానని అన్నారు.
తనను మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఆయన బిజెపి రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి , బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కర్ణ స్వామి గ, కృష్ణా మండల అధ్యక్షులు నరసప్ప , రాఘవేంద్ర , తదితరులు పాల్గొన్నారు.




