Makthal: 7వ వార్డు అభివృద్ధిపై మంత్రి వాకిటి శ్రీహరికి కౌన్సిలర్ దంపతుల కృతజ్ఞతలు!

Makthal: మక్తల్ మున్సిపాలిటీ 7వ వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య నీలగౌడ్ దంపతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

B. NARENDER, MAKTHAL
Published on: 19 Nov 2026 12:47 PM IST
Makthal
X

Makthal: 7వ వార్డు అభివృద్ధిపై మంత్రి వాకిటి శ్రీహరికి కౌన్సిలర్ దంపతుల కృతజ్ఞతలు!

Makthal: మక్తల్ మున్సిపాలిటీ 7వార్డులోని ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేసి ఇటీవలే ప్రారంభించడం, అయ్యప్ప స్వామి షెడ్డు నిర్మాణానికి సహకరించడం పట్ల 7 వార్డు కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య నీలగౌడ్ దంపతులు నేటి ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్న గారిని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అదే సమయంలో వార్డులో ఇంకా ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సమస్యలను విన్న మంత్రి గారు సానుకూలంగా స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఇప్పటికే వార్డులో కొన్ని అభివృద్ధి పనులు పూర్తవడం, మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా మంత్రి గారు సానుకూలంగా స్పందించడం పట్ల కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య నీల గౌడ్ దంపతులు సంతోషం వ్యక్తం చేసారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL