Narayanpet: పదేళ్లలో పేట రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదు?

Narayanpet: నారాయణపేట రోడ్డు క్రెడిట్ కోసమే మాజీ ఎమ్మెల్యే చిట్టెం పాదయాత్ర చేశారని మక్తల్ మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

B. NARENDER, MAKTHAL
Published on: 18 Oct 2026 3:33 PM IST
Narayanpet
X

Narayanpet: పదేళ్లలో పేట రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదు?

Narayanpet: మక్తల్ నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డును 237 కోట్లతో మంత్రి వాకిటి శ్రీహరి గారు మరో 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తారని తెలిసి. రోడ్డు పూర్తయితే రాజకీయంగా తనకు పుట్టగతులు ఉండవని కేవలం క్రెడిట్ కొట్టేసేందుకు మాత్రమే మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాదయాత్రకు తెరలేపారని, పదేళ్లు అధికారంలో ఉండి మక్తల్ - పేట రోడ్డును ఎందుకు పూర్తి చేయలేదని మునిసిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కురి రవికుమార్, అమర్, ప్రశ్నించారు.

ఆదివారం మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి... నిత్యం మక్తల్ మీదుగానే నారాయణపేటకు రాకపోకలు సాగించే వారని, అయితే వారి హయాంలో పదేళ్లపాటు పేట రోడ్డుని పూర్తి చేయాలనే ఆలోచన వారికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పదేళ్లలో నారాయణపేట రోడ్డును పట్టించుకోకుండా... ఇప్పుడు మంత్రి వాకిటి శ్రీహరి గారి హయాంలో నాలుగు లైన్ల రహదారి పనులు 15 రోజుల్లో ప్రారంభిస్తారని తెలిసి, నారాయణపేట రోడ్డు పూర్తయితే రాజకీయంగా తమకి ఇబ్బందులు తప్పవని, కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికే మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారని మండిపడ్డారు.

13 ఏళ్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా పార్టీ అధికారంలో ఉండడంతో పెత్తనం చెలాయించారని... దాదాపు 18 ఏళ్లు అధికారంలో ఉన్న చిట్టెం రామ్మోహన్ రెడ్డి.. కేవలం జీవోలు, కాగితాల కే పరిమితమై మక్తల్ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. 18 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఎందుకు సంగంబండ బండరాయి పగలగొట్టలేదని, ఎందుకు వంద పడకల ఆసుపత్రి ప్రారంభించలేకపోయారని, మక్తల్ లో డయాలసిస్ సెంటర్ ను మీ హయాంలో ఎందుకు ప్రారంభించలేదని, కనీసం డిగ్రీ కళాశాల తరగతులు కూడా మీ హయాంలో సరిగా జరగలేదనే సంగతిని గుర్తు చేశారు.

మంత్రి వాకిటి శ్రీహరి అధికారంలోకి వచ్చిన వెంటనే సంగంబండ బండరాయి పగలగొట్టడంతో పాటు, 150 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి 15 రోజుల్లో ప్రారంభించబోతున్నామని, డయాలసిస్ సెంటర్ సైతం మక్తల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, ఆత్మకూర్ గద్వాల మధ్య 100 కోట్లకు పైగా నిధులతో నూతన బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, చిట్యాల ,మంథన్ గౌడ్ గొల్లపల్లి, మల్లేపల్లి తదితరచోట్ల బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసుకున్నామని, అచ్చంపేట, గురజాల వంటి గ్రామాలలో రోడ్లు లేని చోట రోడ్లు పూర్తయ్యాయని, మున్సిపాలిటీలలో సిసి రోడ్లు వెల్లువలా పూర్తి చేసుకున్నామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తోపాటు, దాదాపు 1800 కోట్ల నిధులు తీసుకువచ్చి మక్తల్ ను మంత్రి వాకిటి శ్రీహరి గారు అభివృద్ధి చేస్తున్నారన్న సంగతి గుర్తు చేశారు.

మంత్రి వాకిటి శ్రీహరి గారు మక్తల్ లోనే పుట్టారని, మక్తల్ లోనే పెరిగారని, చివరి శ్వాస కూడా మక్తల్ లోనే ఉంటుందన్న సంగతి ఎన్నోసార్లు మంత్రి వాకిటి శ్రీహరి గారు స్పష్టం చేశారని, మక్తల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ నిత్యం పాటుపడుతున్న మంత్రి వాకిటి శ్రీహరి గారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లు కలాల్ శ్రీవిద్య నీల గౌడ్, జుట్ల అనిత, మార్కెట్ డైరెక్టర్ ఫయాజ్, జుట్ల శంకర్, మూర్తి,

ఎన్ ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు అఫ్రోజ్, అశోక్ గౌడ్,

కావలి తాయప్ప,

నాయకులు తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL