Makthal: ఢిల్లీ రాంలీలా మైదాన్ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ శ్రేణులు!
Makthal: రాంలీలా మైదానంలో జరిగే 'ఓటు బచావో – దేశ్ బచావో' నిరసనలో పాల్గొనేందుకు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాలతో మక్తల్ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి.
Makthal: ఢిల్లీ రాంలీలా మైదాన్ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ శ్రేణులు!
మక్తల్: మక్తల్ నియోజకవర్గం నుండి నేడు ఓటు బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ రాంలిలా లో జరుగుతున్న ఆందోళన లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటా సురేష్ కుమార్ గుప్తా, వాకిటి హనుమంతు మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గార్లు జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




