Makthal: గూడెబల్లూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చెరువుకట్ట రమేష్ ఎన్నిక

Makthal: మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం గూడెబల్లూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెరువుకట్ట రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చందాపూర్ శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

B. NARENDER, MAKTHAL
Published on: 14 Nov 2026 9:58 PM IST
Makthal
X

Makthal: గూడెబల్లూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చెరువుకట్ట రమేష్ ఎన్నిక

మక్తల్: మక్తల్ నియోజకవర్గం క్రిష్ణ మండలం గూడెబల్లూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చెరువుకట్ట రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడితో పాటు మొత్తం 20 మంది సభ్యులతో గ్రామ కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గూడెబల్లూర్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చందాపూర్ శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజప్ప గౌడ , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సర్ఫరాజ్ , మండల ఉపాధ్యక్షులు వాకిటి నారాయణ , డీసీసీ సభ్యులు విజయ్ గౌడ్ ల సమక్షం లో గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమక్షం లో కమిటీ ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు, కమిటీ సభ్యులకు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL