Makthal: జడ్చర్ల బ్రాహ్మణ శంఖారావానికి కదిలిన మక్తల్ బ్రాహ్మణ సమూహం!
Makthal: జడ్చర్లలో ఉమ్మడి పాలమూరు బ్రాహ్మణ శంఖారావానికి మక్తల్ నుండి భక్తులు తరలివెళ్లారు. 10 వాహనాల్లో తరలినట్లు నాయకులు తెలిపారు.
Makthal: జడ్చర్ల బ్రాహ్మణ శంఖారావానికి కదిలిన మక్తల్ బ్రాహ్మణ సమూహం!
Makthal: జడ్చర్ల లో జరిగే ఉమ్మడి పాలమూరు జిల్లా బ్రాహ్మణ శంఖారావానికి కదిలిన మక్తల్ బ్రాహ్మణ సమూహం బ్రాహ్మణుల ఆత్మగౌరవం, హక్కుల సాధన మరియు సమైక్యతను చాటిచెప్పే లక్ష్యంతో జడ్చర్లలో నిర్వహిస్తున్న "ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ శంఖారావం" మహాసభకు మక్తల్ నియోజకవర్గం నుంచి బ్రాహ్మణ ప్రతినిధులు, బంధుమిత్రులు మరియు మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా బయలుదేరారు.
మక్తల్ 13వ వార్డు కౌన్సిలర్ సరిత,గుర్జాల్ సురేంద్రా చారి, మరియు ఎస్. రమేష్ రావు గార్ల ఆధ్వర్యంలో, వారి మార్గదర్శకత్వంలో ఈ చారిత్రక సభకు సుమారు 100 మంది బ్రాహ్మణులు 10 వాహనాల్లో తరలివెళ్లారు.
పాల్గొన్న ప్రముఖులు:
గుడి శ్యామ్ సుందర్ జోషి
విద్వాన్ రాఘవేంద్ర చారి
ప్రాణేశాచారి,
గోవిందరావు,
రఘు ప్రసన్న భట్,
మఠం వాదిరాజ్,
హనుమేష్ రావు,
పారేవుల తిరుమల,
మరియు పశ్చిమముఖ భజన మండలి మహిళా సభ్యులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ విజయవంతం కావాలని బయలుదేరారు.
సమాజంలో బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, విద్యా-ఉపాధి రంగాలలో తగిన గుర్తింపు సాధించడమే ధ్యేయంగా మక్తల్ నియోజకవర్గ గళాన్ని బలంగా వినిపించడానికి అందరూ సంసిద్ధులయ్యారు.
మన నినాదం:
బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి!
మన హక్కుల సాధనకై... సమైక్యతే మన ఆయుధం!




