Makthal: మక్తల్లో గంజాయి అక్రమ రవాణా భగ్నం ముగ్గురు అరెస్ట్
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్లో 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ డా. వినీత్ వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి సరఫరా.
Makthal: మక్తల్లో గంజాయి అక్రమ రవాణా భగ్నం ముగ్గురు అరెస్ట్
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 60వేల రూపాయల విలువగల 1.4 కిలోల గంజాయి, ఒక స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లు, రూ.7 వేల నగదును స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో జిల్లా ఎస్పీ డా.వినీత్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.వినీత్ మాట్లాడుతూ అక్టోబర్ 17న మక్తల్ పట్టణంలోని రాంలీలా మైదానం వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా నిందితులు మహారాష్ట్ర నుంచి గంజాయిని కొనుగోలు చేసి, రాయచూర్ మీదుగా మక్తల్తో పాటు పరిసర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులు రాయచూరు కు చెందిన ఓం అశోక్(22),సొలపూర్ కు చెందిన రాజశేఖర్(50),యసీన్(37)లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు తెలిపిన ఎస్పీ.ఈ కార్యక్రమంలో డిఎస్పీ లింగయ్య,మక్తల్ సిఐ రాంలాల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




