Kadthal: కడ్తాలలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు. మొక్కలు నాటి, రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసిన నేతలు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Oct 2026 4:49 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాలలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిర్మాణం కోసం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గుప్తా, డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు, కడ్తాల సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తాలు అన్నారు.

శుక్రవారం కడ్తాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఉప్పల వెంకటేష్ గుప్తా, గంప వెంకటేష్ గుప్తా, కౌన్సిలర్ పాపిశెట్టి రాము పలువురు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస, స్వచ్ఛత అనే మూడు సూత్రాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీజీ చూపిన బాటలో నడిచి, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. 200 సంవత్సరాలు ఆంగ్లేయులతో పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహా నాయకుడు అని వారు గుర్తు చేశారు. ఒక్క రక్తపాతం జరగకుండా అహింసా మార్గాన్ని ఎంచుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలలో మొక్కలు నాటారు. ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిక్షపతి, ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు లక్ష్మమ్మ మల్లయ్య, నూర్జహాన్ బేగం జహంగీర్, కృష్ణవేణి రమేష్, ఎర్రోళ్ల రాఘవేందర్, మమతా మహేష్, భాను కిరణ్, కొప్పు వసంత కృష్ణ, దుడ్డు పుల్లమ్మ నాగరాజు, మాదారం గణేష్ గౌడ్, మంకీ మహేష్, ముత్తికృష్ణ, విజయ్ కుమార్, ఎం రవి నాయక్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఉపసర్పంచ్ రామకృష్ణ , సీనియర్ నాయకులు గంప శ్రీనివాస్ గుప్తా, సింగల్ విండో డైరెక్టర్ జోగు వీరయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అర్థం వాసుదేవ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గుప్తా, యువజన సంఘం అధ్యక్షుడు వీరేంద్ర గుప్తా, రవికుమార్ గుప్తా, రమేష్ గుప్తా, లక్ష్మణ్, ప్రకాష్, గంప చంద్రయ్య, గంప వీరయ్య, చేగు రి వెంకటేష్, బోగారం వీరేశం, జూలూరు రమేష్, జి సత్యనారాయణ, రాజశేఖర్, సాయికుమార్, వంశీ కుమార్, జూలూరు శరత్, భరత్, సంద కిరణ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అమృతం పాండు, గూడూరు నరేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, గణేష్, హెచ్ ఆర్ మహేష్, చందోజి, చేగురి రాము, బాచిరెడ్డి వెంకటరెడ్డి, బాచిరెడ్డి అశోక్ రెడ్డి, కంబాలపల్లి అంజి, సిద్ది గారి సురేష్, ఒగ్గు మహేష్, లాయక్ అలీ, యాదిరెడ్డి, సాయిరెడ్డి, గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY