Mahabubnagar: వాలీబాల్‌లో సత్తా చాటి స్వర్ణ పతకం గెలిచిన మహబూబ్‌నగర్ అమ్మాయి!

Mahabubnagar: ఐఐఎం కోజికోడ్ 'సంగ్రామ్ 2026' మహిళల వాలీబాల్ పోటీల్లో మహబూబ్‌నగర్ వాసి గ్రీష్మ సభ్యురాలిగా ఉన్న ఐఐఎం బెంగళూరు జట్టు స్వర్ణ పతకం గెలిచింది.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 20 Nov 2026 8:08 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: వాలీబాల్‌లో సత్తా చాటి స్వర్ణ పతకం గెలిచిన మహబూబ్‌నగర్ అమ్మాయి!

Mahabubnagar: పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించింది మహబూబ్‌నగర్‌ పట్టణం, బీకే రెడ్డి కాలనీ కి చెందిన గ్రీష్మ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బెంగళూరులో పీజీపీ చదువుతున్న గ్రీష్మ తన సహచర క్రీడాకారిణులతో కలిసి మహిళల వాలీబాల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది.

ఐఐఎం కోజికోడ్ ఆతిథ్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘సంగ్రామ్ 2026’ ఇంటర్ ఐఐఎం క్రీడా పోటీల్లో దేశంలోని ఏడు ప్రతిష్ఠాత్మక ఐఐఎంలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఐఐఎం బెంగళూరు, కోజికోడ్, విశాఖపట్నం, తిరుచిరాపల్లి, ముంబై, ఇండోర్, నాగ్‌పూర్ సంస్థల క్రీడాకారులు వివిధ క్రీడా విభాగాల్లో తమ ప్రతిభను చాటారు.

ఈ పోటీల్లో ఐఐఎం బెంగళూరు మహిళల వాలీబాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాటు ఐఐఎం బెంగళూరు మొత్తం పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కూడా సాధించింది.

మహబూబ్‌నగర్‌కు చెందిన గ్రీష్మ జాతీయ స్థాయి విద్యాసంస్థలో విద్యను అభ్యసిస్తూనే క్రీడల్లోనూ రాణించడం విశేషం. ఆమె సాధించిన ఈ విజయం మహబూబ్‌నగర్‌కు గర్వకారణంగా నిలవడమే కాకుండా, విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించగలరనే సందేశాన్నిస్తోంది.

ఈ సందర్భంగా గ్రీష్మ తల్లిదండ్రులు కె శంకర్,కె కవిత ( ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు), బంధువులు , స్నేహితులు మరియు తదితరులు అభినందనలు తెలియజేశారనీ గ్రీష్మ తెలియజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA