Mahabubnagar: ఎన్టీఆర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు: పాల్గొన్న మిథున్ రెడ్డి

Mahabubnagar: మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఎన్‌ఎస్‌యూఐ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి పాల్గొని సందడి చేశారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 8 Oct 2026 8:56 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: ఎన్టీఆర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు: పాల్గొన్న మిథున్ రెడ్డి

Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గారు పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో సందడి చేశారు.

ఈ సందర్భంగా ఏపి మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ...

తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు,యువతీ యువకులు ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి,ప్రకృతి ప్రేమకు ప్రతీక అని అన్నారు.

విద్యార్థి దశ నుంచే మన సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను నింపాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవేజ్,తిరుపతి నాయక్,అనుప శేఖర్,మాజీ NSUI రాష్ట్ర కార్యదర్శి రమేష్,శివ జోగి,నవీన్,హరీష్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

జై తెలంగాణ!

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.