Mahabubnagar: విద్యా వాలంటీర్లకు రూ.10 లక్షల వేతన చెక్కు: విప్ యెన్నం!

Mahabubnagar: మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో 100 మంది విద్యా వాలంటీర్లకు రూ.10 లక్షల గౌరవ వేతన చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 28 Oct 2026 5:43 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: విద్యా వాలంటీర్లకు రూ.10 లక్షల వేతన చెక్కు: విప్ యెన్నం!

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు చేపట్టిన ‘శతశాతం విద్యా కార్యక్రమం’కు ప్రముఖ సంస్థల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోంది. మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో, వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో అమలవుతున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములైన 100 మంది విద్యా వాలంటీర్లకు.. ₹10 లక్షల మూడవ నెల గౌరవ వేతనం చెక్కును ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.

దాతల సహకారం తొ 45 పాఠశాలల్లోని వాలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనం (₹10,000 చొప్పున) అందించేందుకు రాజన్న ఫౌండేషన్ మరియు అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందుకొచ్చాయని ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ​సమాజ బాధ్యత పేదరికం విద్యార్థుల ప్రతిభకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, కార్పొరేట్ సంస్థల సహకారంతో ఆర్థిక భారం తగ్గిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని సంస్థలు విద్యారంగ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.