Mahabubnagar: పెండింగ్ ప్రాజెక్టుల కోసం లక్ష సంతకాల మహోద్యమం: జేఏసీ!
Mahabubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన, డిండి ప్రాజెక్టు రద్దు కోరుతూ ఈ నెల 22 నుంచి లక్ష సంతకాల మహోద్యమం చేపట్టనున్నట్లు ప్రాజెక్టుల సాధన జేఏసీ ప్రకటించింది.
Mahabubnagar: పెండింగ్ ప్రాజెక్టుల కోసం లక్ష సంతకాల మహోద్యమం: జేఏసీ!
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఈ నెల 22వ తేదీ పండుగ సాయన్న జయంతి నుంచి లక్ష సంతకాల మహోద్యమానికి శ్రీకారం చెడుతున్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ వెల్లడించింది.
పండుగ సాయన్న జయంతి నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నట్లు రైతంగంలో చైతన్యం తీసుకువచ్చి దిండి ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసేదాకా తమ పోరాటం కొనసాగుతుందని వారు వెల్లడించారు.
అదేవిధంగా అక్రమంగా నల్లగొండకు నీటిని తరలించడంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని. అనిరుద్ రెడ్డి మాదిరిగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా డిండి ప్రాజెక్టును వ్యతిరేకించాలని. లేకుంటే ఉద్యమ కార్యచరణ చేపట్టి ముందుకు సాగుతామని వారు వెల్లడించారు.




