Mahabubnagar: పాలమూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్య అయ్యప్ప అన్నదానం!

Mahabubnagar: పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య అయ్యప్ప అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయం, వాసవి కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం కొనసాగుతోంది.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 28 Nov 2026 11:24 AM IST
Mahabubnagar
X

Mahabubnagar: పాలమూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్య అయ్యప్ప అన్నదానం!

మహబూబ్ నగర్: పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అలాగే ఆర్యవైశ్య అయ్యప్ప అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులకు నిత్య అన్నదాన ప్రధానం ఘనంగా కొనసాగుతుంది. స్థానిక పట్టణంలోని బ్రాహ్మణవాడి లో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో, అలాగే వాసవి కళ్యాణ మండపం ప్రాంగణంలో అయ్యప్ప మాలధారణ భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహణ కొనసాగుతుంది.

మధ్యాహ్నం ఒంటిగంటకు నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అయ్యప్ప స్వాములకు ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈనెల 24న ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది. పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అలాగే ఆర్యవైశ్య అయ్యప్ప అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజులు ఎంత మంది భక్తులు వచ్చినా వారికి భోజన వసతిని కల్పిస్తున్నారు. ప్రతినిత్యం పెద్ద ఎత్తున వస్తున్నభక్తులు అన్నదాన కార్యక్రమానికి వస్తున్నా వారికి భోజనం అందిస్తున్నారు. పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వామిలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

దాదాపు రెండు నెలన్నర పాటు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని, అలాగే అన్నదానం కార్యక్రమం లో పాల్గొనే అయ్యప్ప మాలధారణ భక్తులకు కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు టోకెన్లు ఇవ్వడం జరుగుతుందని, అయ్యప్ప స్వాములు టోకెన్లు తీసుకుని ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం తీసుకొని అన్నదాన కార్యక్రమం లో పాల్గొనాలని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.