Mahabubnagar: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె: మహబూబ్‌నగర్‌లో భారీ ధర్నా

Mahabubnagar: తెలంగాణలో 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 13 Oct 2026 2:18 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె: మహబూబ్‌నగర్‌లో భారీ ధర్నా

మహబూబ్ నగర్: తెలంగాణలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న దాదాపు 17,000 మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచిన 9 ప్రధాన డిమాండ్లు ను ఉద్యోగాల క్రమబద్ధీకరణ దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలి.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ శాలరీ అందించాలి. ఉద్యోగ, ఆరోగ్య భద్రత: ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రతతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) ఈఎస్‌ఐ (ESI) ఆరోగ్య బీమా తమ 9 ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ధర్నా చౌక్ వద్ద తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.